
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ దగ్గర భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ట్రావెల్స్ బస్సులో గోవా నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్న రూ. 50 లక్షల నైట్రో జెఫమ్ ని పట్టుకున్నారు ఎక్సైజ్ అధికారులు. గురువారం ( అక్టోబర్ 2 ) రాత్రి జహీరాబాద్ చెక్ పోస్ట్ దగ్గర తనిఖీలు నిర్వహించిన అధికారులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
రూ. 50 లక్షల నైట్రో జెఫమ్ ని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. డ్రగ్స్ మహమ్మారిని అంతం చేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఎక్కడికక్కడ ఆకస్మిక దాడులు నిర్వహిస్తూ డ్రగ్స్ ను కట్టడి చేస్తున్నప్పటికీ దుండగులు ఏదో ఒక రూపంలో స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారు.
ఇదిలా ఉండగా.. సెప్టెంబర్ 30న రాచకొండ కమిషనరేట్ పరిధి అబ్దుల్లాపూర్ మెట్ లో డీసీఎంలో గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సిమెంట్ బ్యాగుల మధ్యలో గంజాయి తరలిస్తున్నారు. వీరి నుంచి రూ. 6 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు . మహేశ్వరం పోలీసులు, ఎస్ఓటి పోలీసుల జాయింట్ ఆపరేషన్ చేస్తండగా.. గంజాయి తరలిస్తున్న కీలక నిందితుడిన పట్టుకున్నారు పోలీసులు.