ఉత్సాహంగా అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు

ఉత్సాహంగా అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు

ఆమనగల్లు, వెలుగు: తలకొండపల్లి మండలం దేవుని  పడకల్లు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రైతు సంబరాల పేరుతో ఆదివారం సాయంత్రం నిర్వహించిన అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీల్లో ఏపీలోని వైఎస్సార్  జిల్లా పొద్దుటూరుకు చెందిన చంద్ర ఓబుల్ రెడ్డి ఎద్దుల జత విజేతగా నిలిచింది. తాడూరు మండలం యాదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అఖిలేశ్​రెడ్డి ఎద్దులు సెకండ్, వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం పెద్దదగడ గ్రామానికి చెందిన గోపాలకృష్ణ ఎద్దులు థర్డ్​ ప్లేస్​లో నిలిచాయి.

ఫస్ట్​ ప్రైజ్​ కింద రూ.1,00,116, సెకండ్​ ప్రైజ్​ కింద రూ.75,116, థర్డ్​ ప్రైజ్​ కింద రూ.50,116, ఫోర్త్​ ప్రైజ్​ కింద రూ.30,116 నిర్వాహకులు అందజేశారు. పీఏసీఎస్  చైర్మన్  కేశవరెడ్డి, ఎంపీటీసీలు రమేశ్, రఘునాయక్, మండల కాంగ్రెస్  అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, దాత శ్రీనివాస్ రెడ్డి, ఆలయ చైర్మన్  రాజ్ కుమార్, మాజీ సర్పంచ్  శ్రీశైలం, ఎస్ఐ శ్రీకాంత్  పాల్గొన్నారు.