సలార్ లేటెస్ట్ అప్డేట్

సలార్ లేటెస్ట్ అప్డేట్

యంగ్​ రెబల్ ​స్టార్​ ప్రభాస్, డైరెక్టర్ ​ప్రశాంత్​ నీల్​ కాంబినేషన్​లో వస్తున్న సినిమా సలార్. థియేటికల్ ​రైట్స్​కు డిమాండ్​ పెరిగింది. ఆంధ్ర రాష్ట్రానికి గాను రూ.100 కోట్ల రైట్స్​కు కూడా నిర్మాతలు వదల్లేదని తెలిసింది. వరల్డ్​వైడ్​గా రూ.200 కోట్ల విషయమై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ వేసవికి అభిమానుల్లో జోష్ నింపేలా టీజర్‌, గ్లింప్స్ వీడియో, సలార్‌ పోస్టర్లు.. ఇలా ఒక్కొక్కటీగా విడుదల చేయాలని ప్రశాంత్‌ నీల్‌ ఫిక్స్‌ అయ్యాడట. సినిమా థ్రియాట్రికల్‌ రిలీజ్‌కనుగుణంగా ప్రమోషనల్ యాక్టివిటీస్‌ను వేగవంతం చేసేలా ప్లాన్ రెడీ చేసుకున్నాడని టాక్‌. 

కేజీఎఫ్‌ ప్రాంఛైజీతో బాక్సాఫీస్‌ వద్ద విజయ పరంపర కొనసాగించిన విజయ్ కిరగందూర్‌ హోంబ్యానర్‌ హోంబలే ఫిలిమ్స్ పై సలార్ ను తెరకెక్కిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రభాస్‌ సలార్‌తోపాటు నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో ప్రాజెక్ట్‌ కే,  ఓం రౌత్‌ దర్శకత్వంలో ఆదిపురుష్‌లో సినిమాలను చేస్తున్నాడు. మారుతి డైరెక్ట్ చేస్తున్న రాజా డీలార్స్​హార్రర్‌ కామెడీ ప్రాజెక్ట్‌ కూడా చేయనున్నాడు.