మిమ్మల్ని దేవుడు కూడా క్షమించడు : ఆదిపురుష్ డైరెక్టర్ కు శాపనార్థాలు

మిమ్మల్ని దేవుడు కూడా క్షమించడు : ఆదిపురుష్ డైరెక్టర్ కు శాపనార్థాలు

ఆదిపురుష్ మేకర్స్ పై గైటీ గెలాక్సీ, మరాఠా మందిర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోజ్ దేశాయ్ బహిరంగ విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆదిపురుష్ విషయంలో ఆ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు అంటూ మండిపడ్డారు. తాజాగా ఆయన ఆదిపురుష్ సినిమా, పాత్రల చిత్రీకరణ, సంభాషణలపై స్పందించాడు. 

ఆదిపురుష్ మూవీ టీమ్ వల్ల నేను చాలా బాధపడ్డాను. ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు ఆదిపురుష్ టీమ్ వెంటనే వారికి క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఆ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు. డైరెక్టర్ ఓం రౌత్ హనుమంతుని కోసం ఒక సీటు వదిలేయమన్నాడు. కానీ ఇప్పుడు అన్ని సీట్లు కాళీగానే ఉన్నాయి. అందులో హనుమాన్ కోసం ఏ సీటు బుక్ చేయమంటారో చెప్పండి. మతపరమైన అంశాలతో సినిమాలు తీసినప్పుడు ఇలాంటి అర్థంలేని పనులు చేయకూడదు. రామాయనాన్ని తప్పుగా చూపించడంపై కేవలం హిందువులే కాదు ముస్లిమ్స్ కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు" అంటూ తీవ్రంగా మండిపడ్డారు మనోజ్ దేశాయ్. ప్రస్తుతం మనోజ్ దేశాయ్ చేసిన ఈ కామెంట్స్ అటు ఇండస్ట్రీలో, ఇటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

ఇక రామాయణ గాధ ఆధారంగా వచ్చిన ఆదిపురుష్ సినిమాపై వివాదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామాయణాన్ని తప్పుగా చూపించారని, పాత్రల చిత్రీకరణ, సంభాషణలు కూడా అభ్యంతరకరంగా ఉన్నాయని, అందుకే ఈ సినిమాను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాయి హిందూ సంఘాలు.