బెంగాల్​లో టఫ్​ ఫైట్

బెంగాల్​లో టఫ్​ ఫైట్

బెంగాల్​​ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్​ కాంగ్రెస్​, బీజేపీ మధ్యే టఫ్​ ఫైట్​ ఉంటుందని ఎగ్జిట్​ పోల్స్​ ఫలితాలు వెల్లడించాయి. సీఎం మమత పదేండ్ల పాలనకు ముగింపు పలికి పవర్​ను 
చేజిక్కించుకోవాలని తీవ్రంగా శ్రమించిన బీజేపీ గట్టి పోటీ ఇచ్చినట్టు తెలిపాయి. అయితే మెజార్టీ సర్వేలు మమత వైపే మొగ్గు చూపాయి. బీజేపీ అస్సాం, పుదుచ్చేరిలో ఈజీగా గెలిచే ఛాన్స్​ ఉందని అంచనా వేశాయి. తమిళనాడులో ప్రతిపక్ష డీఎంకే, కేరళలో అధికార లెఫ్ట్ కూటమి గెలవనున్నాయని ఎగ్జిట్​ పోల్స్​ వెల్లడించాయి.
న్యూఢిల్లీ: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య టఫ్‌  ఫైట్‌  ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. సీఎం మమత పదేళ్ల పాలనకు ముగింపు పలికి, రాష్ట్రంలో తొలిసారి పవర్ ను చేజిక్కించుకోవాలని తీవ్రంగా శ్రమించిన బీజేపీ గట్టి పోటీని ఇస్తున్నట్లు తెలిపాయి. అయితే మెజారిటీ సర్వేలు మమతవైపు మొగ్గు చూపాయి. బీజేపీ అస్సాం, పుదుచ్చేరిల్లో ఈజీగానే గెలిచే చాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఇక తమిళనాడులో ప్రతిపక్ష డీఎంకే, కేరళలో అధికార లెఫ్ట్ కూటమే గెలువనున్నాయని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. 
బెంగాల్ లో హోరాహోరీ 
బెంగాల్ లో బీజేపీ, తృణమూల్ మధ్య హోరాహోరీ పోరు నెలకొందని ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా అంచనా వేసింది. స్టేట్ లో 294 అసెంబ్లీ సీట్లు ఉండగా, బీజేపీ 134 నుంచి 160 సీట్లను గెలుచుకుంటుందని, తృణమూల్ 130 నుంచి 156 సీట్లను గెలుచుకోవచ్చని పేర్కొంది. బీజేపీ 143 సీట్లు, తృణమూల్ 13౩ సీట్లు గెలుచుకోవచ్చని రిపబ్లిక్-సీఎన్ఎక్స్ అంచనా వేసింది. జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ లోనూ బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని అంచనా వేశారు. కమలం పార్టీ 174 సీట్లతో బంపర్ మెజారిటీ సాధిస్తుందని, తృణమూల్ 112 సీట్లకే పరిమితం అవుతుందని పేర్కొన్నారు. అయితే టైమ్స్ నౌ –సీవోటర్ మాత్రం తృణమూల్ 158 సీట్లతో గెలుస్తుందని, బీజేపీ 115 సీట్లకు పరిమితం అవుతుందని వెల్లడించింది.   
అస్సాంలో బీజేపీదే గెలుపు
అస్సాంలో బీజేపీ గెలుపు ఖాయమని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా వెల్లడించింది. 126 అసెంబ్లీ సీట్లకు బీజేపీ 75 నుంచి 85 గెలుస్తుందని, కాంగ్రెస్ కు 40 నుంచి 50 సీట్లు రావచ్చని తెలిపింది. 
కేరళలో మళ్లీ లెఫ్ట్ 
కేరళలో లెఫ్ట్ ఆధ్వర్యంలోని ఎల్డీఎఫ్ కూటమి అధికారాన్ని నిలబెట్టుకోనుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు స్పష్టం చేశాయి. ఇక్కడ లెఫ్ట్ తిరిగి అధికారంలోకి వస్తే.. అధికారంలోని కూటమి రెండోసారి మళ్లీ పవర్ ను చేజిక్కించుకోవడం ఇదే ఫస్ట్ టైం కానుంది. స్టేట్ అసెంబ్లీలో 140 సీట్లు ఉండగా, ఎల్డీఎఫ్ 104 సీట్లు, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ 20 నుంచి 36 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని యాక్సిస్ మై ఇండియా అంచనా వేసింది. ఎల్డీఎఫ్ కు 93 నుంచి 111, యూడీఫ్ కు 26 నుంచి 44 వస్తాయని టుడేస్ చాణక్య, 72 నుంచి 80, 54 నుంచి 64 వస్తాయని రిపబ్లిక్ సీఎన్ఎక్స్ అంచనా వేశాయి.  
తమిళనాడు డీఎంకేదే..
తమిళనాడు అసెంబ్లీలో 234 సీట్లుండగా, డీఎంకే, కాంగ్రెస్ కూటమికి 175 నుంచి 195 సీట్లు వస్తాయని యాక్సిస్, 160 నుంచి 170 వస్తాయని సీఎన్ఎక్స్ అంచనా వేశాయి. అన్నా డీఎంకే, బీజేపీ కూటమికి 38 నుంచి 54, 58 నుంచి 68 సీట్లు రావచ్చని వెల్లడించాయి. డీఎంకే కూటమికి 164 నుంచి 186 సీట్లు, అన్నా డీఎంకే కూటమికి 46 నుంచి 68 సీట్లు వస్తాయని టుడేస్ చాణక్య అంచనా వేసింది. 
పుదుచ్చేరిలో కాంగ్రెస్ ఇంటికే
 పుదుచ్చేరి అసెంబ్లీలో 30 సీట్లకు గాను బీజేపీ 20 నుంచి 24 సీట్లతో బంపర్ మెజారిటీతో గెలవనుందని, కాంగ్రెస్ 6 నుంచి 10 సీట్లకే పరిమితం కానుందని సర్వేలు అంచనా వేస్తున్నాయి.