లాలి జో.. చందమామ జోజో.. ‘జటాధర’ నుంచి సాంగ్ రిలీజ్

లాలి జో.. చందమామ జోజో.. ‘జటాధర’ నుంచి సాంగ్ రిలీజ్

సుధీర్ బాబు హీరోగా, సోనాక్షి సిన్హా నెగెటివ్‌‌‌‌ రోల్‌‌‌లో వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్‌‌‌‌ తెరకెక్కించిన చిత్రం ‘జటాధర’. శిల్పా శిరోద్కర్ కీలక పాత్రలు పోషించారు. జీ స్టూడియోస్‌‌‌‌, ప్రెర్ణా అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మించారు.

తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌‌‌‌‌‌‌‌, రెండు పాటలు ఆకట్టుకున్నాయి. తాజాగా ‘జో లాలి జో’ అనే పాటను విడుదల చేశారు. రాజీవ్ రాజ్ కంపోజ్ చేయడంతో పాటు పావని వాసతో కలిపి పాడారు.

‘‘జోలాలి జో.. లాలి జో.. చందమామ జోజో.. వెన్నెలమ్మ జోజో.. బంగారు చిన్నారి జోజో.. నిదరోర మీ అమ్మ ఒడిలో..”అంటూ శ్రీమాన్‌‌‌‌ కీర్తి రాసిన లిరిక్స్‌‌‌‌ ఆకట్టుకున్నాయి.  రవి ప్రకాష్‌‌‌‌, ఇందిరా కృష్ణన్‌‌‌‌ జంటపై చిత్రీకరించారు. నవీన్ నేని, రోహిత్ పాఠక్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, సుభలేఖ సుధాకర్‌‌‌‌ ఇతర పాత్రలు పోషించారు.  జటాధర నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.