బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు

బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు

ఈస్ట్ గోదావరి: బాణాసంచా తయారీ సెంటర్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున సామర్లకోట మండలం జి.మేడపాడులో జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు కాకినాడ హస్పిటల్ కి తరలించారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు డాక్టర్లు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.