తుర్కియే బార్టిన్ ప్రావిన్స్​లోని బొగ్గు గనిలో జరిగిన పేలుడు

తుర్కియే బార్టిన్ ప్రావిన్స్​లోని బొగ్గు గనిలో జరిగిన పేలుడు

అంకారా: తుర్కియే బార్టిన్ ప్రావిన్స్​లోని బొగ్గు గనిలో జరిగిన పేలుడులో మృతు ల సంఖ్య 40కి పెరిగింది. మరో 11 మంది గాయపడ్డారని వారిని ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్న ట్లు ఆ దేశ మంత్రి సులేమాన్ సోయ్లు తెలిపారు. 58 మందిని గనిలో నుంచి క్షేమంగా బయటకు తీసినట్లు వివరించారు. మరో వ్యక్తి ఆచూకీ తెలియాల్సి ఉందని చెప్పారు. అమస్ర పట్టణంలోని గనిలో శుక్రవారం సాయంత్రం పేలుడు జరగ్గా.. ఆ టైంలో దాదాపు 110మంది అక్కడ పనిచేస్తు న్నట్లు వెల్లడించారు.  

సహాయక చర్యలు పూర్తికావచ్చాయని ఎనర్జీ మినిస్టర్ ఫాతిహ్ డోన్మెజ్ తెలిపారు. మండే వాయువులను సూచించే మీథేన్(ఫైర్‌‌డ్యాంప్) వల్ల గనిలో పేలుడు సంభవించినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నామని చెప్పారు. గనిలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు వివరించారు.