పేలుడు పదార్థాలు స్వాధీనం.. చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌ రాష్ట్రంలోని కాంకేర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో గుర్తింపు

పేలుడు పదార్థాలు స్వాధీనం.. చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌ రాష్ట్రంలోని కాంకేర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో గుర్తింపు

భద్రాచలం, వెలుగు: భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు ఏర్పాటు చేసిన పేలుడు పదార్థాలను జవాన్లు నిర్వీర్యం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌ రాష్ట్రంలోని కాంకేర్‌‌‌‌‌‌‌‌ జిల్లా కోయలీబేడా పోలీస్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌ పరిధిలోని డోమాంజ్, ఆమాకీల్, గట్టాకాల్‌‌‌‌‌‌‌‌ అడవుల్లో కాంకేర్​ పోలీసులు, డీఆర్జీ, బీఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ జవాన్లు బాంబ్​స్క్వాడ్‌‌‌‌‌‌‌‌లతో కలిసి తనిఖీలు నిర్వహించారు. 

ఈ క్రమంలో భద్రతా బలగాలు నిత్యం తిరిగే రహదారుల్లో పాతిపెట్టిన పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ప్రెషర్‌‌‌‌‌‌‌‌ కుక్కర్‌‌‌‌‌‌‌‌ బాంబాలు, రెండు పైపు బాంబులు, ఐదు పెట్రోల్‌‌‌‌‌‌‌‌ బాంబులు, 50 బీజీఎల్‌‌‌‌‌‌‌‌ సెల్స్‌‌‌‌‌‌‌‌, కరెంట్‌‌‌‌‌‌‌‌ వైర్‌‌‌‌‌‌‌‌ కట్టలు ఉన్నట్లు భద్రతాబలగాలు తెలిపాయి. బాంబ్‌‌‌‌‌‌‌‌ స్క్వాడ్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేశారు.