25 లక్షల వెహికల్స్‌‌‌‌‌‌‌‌ ఎగుమతి..మారుతి సుజుకీ

25 లక్షల వెహికల్స్‌‌‌‌‌‌‌‌ ఎగుమతి..మారుతి సుజుకీ

న్యూఢిల్లీ: ఇప్పటి వరకు 25 లక్షల వెహికల్స్‌‌‌‌ను ఎగుమతి చేశామని మారుతి సుజుకీ బుధవారం ప్రకటించింది.  తన 25 లక్షవ బండిగా సుజుకీ బాలెనోని  గుజరాత్‌‌‌‌లోని ముంద్రా పోర్ట్ నుంచి లాటిన్ అమెరికాకు  ఎగుమతి చేశామని వెల్లడించింది.  ఎగుమతుల్లో 25 లక్షల యూనిట్ల మైలురాయిని చేరుకోవడం ఇండియా మాన్యుఫాక్చరింగ్ కెపాసిటీకి నిదర్శనమని  కంపెనీ ఎండీ హిసషి టకెయుచి అన్నారు. ప్రభుత్వం తెచ్చిన మేకిన్ ఇండియా ఇనీషియేటివ్‌‌‌‌కు సపోర్ట్‌‌‌‌గా ఉన్నామని పేర్కొన్నారు. మారుతి సుజుకీ  మొదటిసారిగా 1986– 87 లో ఎగుమతులు స్టార్ట్ చేసింది. మొదటి కన్‌‌‌‌సైన్‌‌‌‌మెంట్ కింద  500 కార్లను హంగేరికి   ఎక్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ చేసింది. ప్రస్తుతం మారుతి సుజుకీ సుమారు 100 దేశాలకు  కార్లను ఎగుమతి చేస్తోంది. ‘కంపెనీ ఎక్స్‌‌‌‌పోర్ట్స్‌‌‌‌ 1986–87 ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి మా వెహికల్స్‌‌‌‌ను కస్టమర్లు ఆదరిస్తున్నారు. హై క్వాలిటీ, సూపీరియర్ టెక్నాలజీ, రిలయబిలిటీ, పెర్ఫార్మెన్స్‌‌‌‌, అఫోర్డబిలిటీ వంటి కారణాలతో గ్లోబల్‌‌‌‌ కస్టమర్లకు చేరువయ్యాం’ అని టకెయుచి పేర్కొన్నారు.  ఇండియా నుంచి ప్యాసెంజర్ వెహికల్స్‌‌‌‌ ఎగుమతి చేస్తున్న కంపెనీల్లో నెంబర్ వన్ పొజిషన్‌‌‌‌లో మారుతి సుజుకీ ఉందని అన్నారు.  నెక్సా రిటైల్ స్టోర్ల ద్వారా అమ్మే ప్రీమియం కార్లు ఈ ఏడాది టాటా మోటార్స్‌‌‌‌, హ్యూండయ్  సేల్స్ కంటే ఎక్కువగా ఉంటాయని మారుతి సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ శశాంక్‌‌‌‌ శ్రీవాస్తవ అన్నారు. కాగా, కంపెనీ 2015 లో తమ నెక్సా రిటైల్ స్టోర్లను ప్రారంభించింది. బాలెనో, ఇగ్నీస్‌‌‌‌, సియాజ్‌‌‌‌, ఎక్స్‌‌‌‌ఎల్‌‌‌‌6, గ్రాండ్ విటారా వంటి కార్లను ఈ స్టోర్లలో అమ్ముతున్నారు.