హైదరాబాద్, వెలుగు: పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్ఎస్ఐ) హైదరాబాద్ చాప్టర్‘పీఆర్ఎస్ఐ బెస్ట్ చాప్టర్ అవార్డు–2025’ను సొంతం చేసుకుంది. ఉత్తరాఖండ్ నగరం డెహ్రాడూన్‌లో నిర్వహించిన 47వ ఆల్ ఇండియా పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్ ముగింపు సభలో ఆ రాష్ట్ర మంత్రి సుబోధ్ ఉనియాల్ దీనిని అందజేశారు. పీఆర్ఎస్ఐ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ యాదగిరి కంభంపాటి, కార్యదర్శి రాజేశ్‌తో పాటు చాప్టర్ సభ్యులు అవార్డును స్వీకరించారు.
