గత సంవత్సరం అక్టోబరుతో పోలిస్తే 11 శాతం తగ్గిన ఎగుమతులు

గత సంవత్సరం అక్టోబరుతో పోలిస్తే 11 శాతం తగ్గిన ఎగుమతులు

న్యూఢిల్లీ: మన దేశ వాణిజ్య ఎగుమతులు గత సంవత్సరం అక్టోబరుతో పోలిస్తే ఈసారి అక్టోబరులో 11.8 శాతం తగ్గి  34.38 బిలియన్​ డాలర్లకు చేరుకున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 27న యూఎస్ సుంకాలను 50 శాతం పెంచడంతో వరుసగా రెండో నెలలోపై ఎగుమతులు మందగించాయి. పెట్రోలియం ఉత్పత్తులు, రత్నాలు, నగల రంగాలలో తగ్గుదల ఉందని క్రిసిల్​రిపోర్ట్ తెలిపింది. పెట్రోలియం ఉత్పత్తులు 10.4 శాతం తగ్గాయి.

ప్రధాన ఎగుమతులు 10.2 శాతానికి పడిపోయాయి. సెప్టెంబరు 2025లో ఇవి 6.1 శాతం వృద్ధి చెందాయి. అక్టోబరులో యూఎస్ మార్కెట్లకు వాణిజ్య ఎగుమతులు 8.6 శాతం తగ్గి  6.3 బిలియన్​ డాలర్లకు పరిమితమయ్యాయి. సెప్టెంబరులో ఇవి 11.9 శాతం తగ్గాయి. అమెరికాయేతర మార్కెట్లకు ఎగుమతులు గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 12.5 శాతం తగ్గాయి. సెప్టెంబరులో 10.9 శాతం వృద్ధి ఉందని క్రిసిల్ ​ తెలిపింది.