భారీగా పెరిగిన బండ్ల ఎగుమతులు

భారీగా పెరిగిన బండ్ల ఎగుమతులు

న్యూఢిల్లీ : ప్యాసింజర్ వెహికల్స్ ఎగుమతులు గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో  2.68 లక్షల యూనిట్లు పెరిగాయి. ఇండస్ట్రీ డేటా ప్రకారం,  2020–21 లో ఇండియా నుంచి 4,04,397 ప్యాసింజర్ బండ్లు ఎగుమతి  అవ్వగా, 2023–24 నాటికి ఈ నెంబర్ 6,72,105 యూనిట్లకు పెరిగింది.  వీటిలో మారుతి సుజుకీ వాటా 70 శాతంగా ఉంది. ఈ కంపెనీ ఎగుమతులు గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో 1,85,774 యూనిట్లు పెరిగాయి.  

కొత్త మోడల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీసుకొస్తుండడం, టయోటతో టై అప్ కావడం,  గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టాండర్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తగ్గట్టు ప్రొడక్షన్ ఉండడంతో కంపెనీ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్స్ పెరిగాయని మారుతి సుజుకీ ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్ కార్పొరేట్ అఫైర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాహుల్ భాటియా అన్నారు. ప్రస్తుతం 100 దేశాలకు బండ్లను ఎగుమతి  చేస్తున్నామని చెప్పారు.

సియామ్ డేటా ప్రకారం, 2023–24 లో ఇండియా నుంచి 6,72,105 ప్యాసింజర్ వెహికల్స్ ఎగుమతి అవ్వగా, ఇందులో 2,80,712 యూనిట్లను మారుతి, 1,63,155 యూనిట్లను హ్యుండాయ్ ఎగుమతి చేశాయి.

మరిన్ని వార్తలు