ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ నుంచి ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రీమ్ బాక్స్

ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ నుంచి ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రీమ్ బాక్స్

న్యూఢిల్లీ: జియో బ్రాడ్‌‌‌‌‌‌‌‌బ్యాండ్‌‌‌‌‌‌‌‌ గిగాఫైబర్‌‌‌‌‌‌‌‌గా పోటీగా ప్రముఖ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ టెల్కో సంస్థ ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ సోమవారం తన ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ టీవీ  ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రీమ్ డీటీహెచ్‌‌‌‌‌‌‌‌ సెట్‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌ బాక్స్​ ప్రవేశపెట్టింది. ఓటీటీ కంటెంట్‌‌‌‌‌‌‌‌ను అందించే ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రీమ్ స్టిక్‌‌‌‌‌‌‌‌లను కూడా విడుదల చేసింది. జియోఫైబర్ వాణిజ్య సేవలకు సిద్ధమవుతున్న తరుణంలో ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ వీటిని ఆవిష్కరించింది. ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రీమ్‌‌‌‌‌‌‌‌ను 4కే హైబ్రీడ్ బాక్స్‌‌‌‌‌‌‌‌గానూ పిలుస్తారు. దీని ధర రూ.3,999. అంటే ఇది 4కే వీడియోలను కూడా సపోర్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తుంది. ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ డిజిటల్ టీవీ వినియోగదారులు పాత సెట్‌‌‌‌‌‌‌‌టాప్ బాక్స్‌‌‌‌‌‌‌‌ను ఎక్సేంజీకి ఇస్తే దీనిని రూ.2,249కే పొందవచ్చు.

దీంతోపాటు ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రీమ్ యాప్ కంటెంట్‌‌‌‌‌‌‌‌పై ఏడాది సబ్‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్ (రూ.999 విలువైనది) లభిస్తుంది. అలాగే, హెచ్‌‌‌‌‌‌‌‌డీ డీటీహెచ్ ప్యాక్‌‌‌‌‌‌‌‌కు నెల రోజుల సబ్‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్‌‌‌‌‌‌‌‌ను ఉచితంగా ఇస్తారు. ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ రిటైల్ స్టోర్లు, ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ డాట్ ఇన్, అమెజాన్, ఫ్లిప్‌‌‌‌‌‌‌‌కార్ట్‌‌‌‌‌‌‌‌ల ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. సెట్‌‌‌‌‌‌‌‌టాప్ బాక్స్ ఆండ్రాయిడ్ 9.0పై ఓఎస్‌‌‌‌‌‌‌‌తో పనిచేస్తుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్స్‌‌‌‌‌‌‌‌ను డౌన్‌‌‌‌‌‌‌‌ లోడ్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. వై-ఫై కనెక్టివిటీ సైతం ఉంది.  ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రీమ్ స్టిక్  ద్వారా నెట్‌‌‌‌‌‌‌‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్‌‌‌‌‌‌‌‌లను యాక్సెస్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఓఎస్‌‌‌‌‌‌‌‌పై పనిచేస్తుంది. ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రీమ్ స్టిక్ ధర రూ.3,999. మొదటి నెల సబ్‌‌‌‌‌‌‌‌సబ్‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్ ఉచితం. ఆ తర్వాతి నుంచి ఏడాదికి రూ.999 ప్యాక్‌‌‌‌‌‌‌‌తో రీచార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది.