V6 News

జీడీపీ వృద్ధి 6 శాతమే: ఈవై ఇండియా అంచనా

జీడీపీ వృద్ధి 6 శాతమే: ఈవై ఇండియా అంచనా

న్యూఢిల్లీ: భారతదేశ జీడీపీ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని, రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆర్‌‌బీఐ నిర్దేశించిన అప్పర్ లిమిట్‌ 6 శాతం  వరకు పెరిగే అవకాశం ఉందని కన్సల్టెంగ్ కంపెనీ ఈవై ఇండియా తెలిపింది. భారత క్రూడ్‌ బాస్కెట్‌ ధర బ్యారెల్‌కు  120 డాలర్లకు చేరడమే ఇందుకు కారణమని వివరించింది. 

ఆయిల్ ధరలు  పెరిగితే ఇండియా ద్రవ్య లోటు ఎక్కువవుతుంది.   ఆర్‌‌బీఐ మాత్రం వృద్ధి 6.9శాతంగా, ద్రవ్యోల్బణం 4.6శాతంగా అంచనా వేసింది.