రాజస్థాన్‎లో పార్టీని ప్రారంభించి.. వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తాం..

రాజస్థాన్‎లో పార్టీని ప్రారంభించి.. వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తాం..

రాజస్థాన్‌లో తమ పార్టీని ప్రారంభిస్తామని ఎంఐఎం చీఫ్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. తమ పార్టీని జాతీయ స్థాయిలో మరింతగా విస్తరించాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రాజస్థాన్ పర్యటనలో ఉన్న ఆయన పై వ్యాఖ్యలు చేశారు. మరో 45 రోజుల్లో రాజస్థాన్‌లో తమ పార్టీని ప్రారంభిస్తామని ఒవైసీ తెలిపారు. జైపూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని చెప్పారు. ‘రాజస్థాన్‌లో త్వరలోనే పార్టీని ప్రారంభిస్తున్నాం. కాబట్టి వచ్చే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తాం’ అని చెప్పారు. ఇప్పటికే మహారాష్ట్ర, బీహార్‌లో తన ఉనికిని చాటుకున్న ఆ పార్టీ.. తాజాగా రాజస్థాన్‌, గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌, మధ్య ప్రదేశ్‌, తమినాడు, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్‌లో పార్టీని విస్తరించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.