F3 'ఫన్'టాస్టిక్..రూ.100 కోట్ల సెలబ్రేషన్స్‌

F3 'ఫన్'టాస్టిక్..రూ.100 కోట్ల సెలబ్రేషన్స్‌

 

కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన F3 మూవీ..ఈ వేసవిలో థియేటర్లలో నవ్వుల వర్షాన్ని కురిపిస్తూ..సక్సెస్ ఫుల్గా దూసుకెళ్తోంది. F2కు సీక్వెల్ వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ వైజాగ్లోని ఆర్‌.కె.బీచ్‌ దరి గోకుల్‌పార్కులో F3 ట్రిపుల్ బ్లాక్ బస్టర్ 'ఫన్'టాస్టిక్ సెలబ్రేషన్స్‌ను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్, దర్శకుడు అనిల్ రావిపూడి కుర్రాడు బాబోయ్ పాటకు స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. 

మహిళల ఆదరణతోనే F3 విజయం:వెంకటేష్
ఎఫ్3ని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు బిగ్ థాంక్స్. వైజాగ్ అంటే నాకు చాల స్పెషల్. కలియుగ పాండవులు, స్వర్ణ కమలం, గోపాల గోపాల, సీతమ్మ వాకిట్లో,మల్లీశ్వరి, గురు  ఇలా చాలా సినిమాలు వైజాగ్లోనే చేశాను. F3 ట్రిపుల్ బ్లాక్ బస్టర్ వేడుక ఇక్కడే జరుపుకోవడం ఆనందంగా వుంది. అనిల్ రావిపూడి, దిల్ రాజు మంచి స్క్రిప్ట్తో వచ్చారు. మీరు గొప్ప నారప్ప, దృశ్యం ఓటీటీకి వెళ్ళడంతో అభిమానులు కొంత నిరాశ చెందారు. అందుకే F3లో నారప్ప గెటప్ లో వచ్చి ఫ్యాన్స్ని థ్రిల్ చేయాలని అనుకున్నాను. మహిళలు ఆదరించడం వల్లే సినిమా సూపర్ హిట్ అయింది. 

ప్రేక్షకుల ఆదరణే మాకు రూ.100 కోట్లతో సమానం:వరుణ్ తేజ్
 200 మంది ఆర్టిస్టులతో రెండేళ్ళ పాటు కష్టపడి రెండున్న గంటల పాటు మీరు ఆనందంగా ఉండాలని సినిమా తీశాం. డబ్బులు, కలెక్షన్స్ ఇవ్వలేని తృప్తి.. మీరు సినిమా చూశాక శభాస్ అంటే వస్తుంది.  F3 సినిమాకి మీరు చూపిన ఆదరణే మాకు వంద కోట్లతో సమానం. ఇందులో నటించిన ఆర్టిస్టులందరికీ కృతజ్ఞతలు. అనిల్ రావిపూడికి  ఒక యునిక్ స్టైల్ ఉంది. దాని వలనే వరుసగా ఆరు హిట్లు కొట్టారు. ఆయన ఇంకో 36 హిట్లు కొట్టాలి. నిర్మాత దిల్ రాజు సినిమాపై ప్యాషన్ ఉన్న ప్రొడ్యుసర్. వెంకటేష్ గారు ఇచ్చిన సపోర్ట్ని మర్చిపోలేను. 

త్వరలో F4:అనిల్ రావిపూడి
F3 విడుదలై  9 రోజులైంది.  వందకోట్లు క్రాస్ చేశాం. ఈ క్రెడిట్ ప్రేక్షకులకు దక్కుతుంది.  'F2' ఫ్రాంచైజీని కొనసాగించవచ్చనే ధైర్యాన్ని F3 విజయంతో ఇచ్చారు. ఈ సినిమాని నవ్వుకోవడాకే తీశామని మొదటి నుండి చెబుతూనే ఉన్నాం.  ఆ నవ్వుల విలువ రూ. 100కోట్లతో తిరిగిచ్చారు. F2కి వచ్చిన కలెక్షన్ కంటే F3కి వచ్చిన కలెక్షన్స్  ఎక్కువ కిక్ ఇస్తున్నాయి.  F4 ప్రకటన కూడా త్వరలోనే వస్తుంది. 

F3 సినిమా వల్ల థియేటర్లు ప్రేక్షకులతో నిండిపోయాయన్నారు నిర్మాత దిల్ రాజు. మంచి సినిమాలు ఇస్తామని నమ్మకం ఉంచిన తెలుగు ప్రేక్షకులకు, ఫ్యామిలీ ఆడియన్స్ కు ఆయన  ధన్యవాదాలు తెలిపారు.  ఒక ఫ్యామిలీ సినిమా కొవిడ్ తర్వాత వందకోట్లు టచ్ చేయడం ఎంతో ప్రత్యేకమైంది.  ఎఫ్ 4ని ఎలా చేయాలనే టెన్షన్ ఇప్పటి నుండే అనిల్ రావిపూడికి పట్టుకుంది. లాజికల్ గా మ్యాజికల్ గా చింపే సినిమా చేయడమే గోల్ అన్నారు. F4 త్వరలోనే ప్రకటిస్తామన్నారు. అనుకున్నట్లుగా F3 బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందన్నారు నటుడు రాజేంద్రప్రసాద్.  ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమా హిట్ కాకపొతే మళ్ళీ  ప్రేక్షకుల ముందు కనిపించనని ఛాలెంజ్ చేశానని...అయితే సినిమాతో పాటు ప్రేక్షకుల మీద ఉన్న నమ్మకంతోనే అలా చెప్పానన్నారు. తెలుగు ప్రేక్షకులు వినోదం పంచె సినిమాలకు న్యాయం చేస్తారని మరోసారి రుజువైందని చెప్పారు.


'విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్  దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం 'F3'.  డబుల్ బ్లాక్‌బస్టర్ 'F2' ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పకులుగా నిర్మాత శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మే 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలై F3  బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. 9 రోజుల్లో వంద కోట్ల రూపాయిల గ్రాస్ కలెక్ట్ చేసి హౌస్ ఫుల్ వసూళ్ళతో దూసుకుపోతుంది. 

9 రోజుల కలెక్షన్
తెలుగు రాష్ట్రాల్లో టోటల్ గా 9రోజులకు వచ్చిన కలెక్షన్స్  చూస్తే.. నైజాంలో రూ. 16.91 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.62 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.44 కోట్లు, ఈస్ట్‌లో రూ. 3.06 కోట్లు, వెస్ట్‌లో రూ. 2.23 కోట్లు, గుంటూరులో రూ. 2.97 కోట్లు, కృష్ణాలో రూ. 2.61 కోట్లు, నెల్లూరులో రూ. 1.62 కోట్లు రాబట్టింది. మొత్తంగా రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 40.46 కోట్లు షేర్, రూ. 65 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గా చూస్తే..రెండు రాష్ట్రాల్లో 9 రోజులకు రూ. 40.46 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.72 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.85 కోట్లను సాధించింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా 9 రోజుల్లో రూ. 50.03 కోట్లు షేర్, రూ. 83.68 కోట్లు గ్రాస్ రాబట్టింది.

మరిన్ని వార్తల కోసం..

ప్రేక్షకులు థియేటర్లో చూస్తేనే మూవీకి నిజమైన సక్సెస్

'మేజర్' హీరో అడవి శేషు ఇంటర్వ్యూ