ఉపాధి పనుల్లో ఫేస్ అథెంటికేషన్ మస్ట్... అమల్లోకి ‘నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్’

ఉపాధి పనుల్లో  ఫేస్ అథెంటికేషన్ మస్ట్... అమల్లోకి ‘నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్’

హైదరాబాద్, వెలుగు: ఉపాధి హామీ పనుల్లో ఇకపై కూలీల హాజరును ఫేస్ అథెంటికేషన్‌ను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉపాధి హామీ పథకం కింద జరిగే పనుల్లో అవకతవకలను అరికట్టేందుకు నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్(ఎన్‌ఎంఎంఎస్)ను రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సోమవారం సర్క్యులర్ జారీ చేసింది. కమ్యూనిటీ పనులకు ఈ నెల 2 నుంచే ఫేస్ అథెంటికేషన్ అమల్లోకి రాగా, ఇకపై వ్యక్తిగత లబ్ధిదారుల పనులకు కూడా వర్తింపజేయనున్నారు.