చర్మం దెబ్బ తినకుండా ఉండాలంటే ఫేస్‌‌ సీరమ్‌‌లు వాడాలి

చర్మం దెబ్బ తినకుండా ఉండాలంటే ఫేస్‌‌ సీరమ్‌‌లు వాడాలి

ఈ నెలంతా పండుగల సీజనే.. బతుకమ్మ, దసరా పండుగలు అయిపోయాయి. దీపావళి పండుగ రాబోతుంది. ప్రత్యేక సందర్భాల్లో, పండుగలప్పుడు మేకప్‌‌ ప్రొడక్ట్స్‌‌ వాడినా చర్మం దెబ్బ తినకుండా ఉండాలంటే ఈ ఫేస్‌‌ సీరమ్‌‌లు వాడాలి. ఇవి యాంటీ ఏజింగ్‌‌గా కూడా పనిచేస్తాయి.

  •   చాలారకాల యాంటీ ఏజెనింగ్‌‌ క్రీముల్లో విటమిన్‌‌– సి వాడతారు. ఇది సూర్య కిరణాలు, ఫ్రీ రాడికల్స్‌‌ డ్యామేజ్‌‌ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. కొత్త కణాల ఉత్పత్తికి సాయపడుతుంది. మొటిమలు, పిగ్మెంటేషన్‌‌ రానీయదు.
  •   గ్లైకోలిక్‌‌ యాసిడ్‌‌ చర్మంపై ఉండే ముడతలు, మచ్చల్ని తగ్గిస్తుంది. ఇది చర్మం పై పొరలోని డెడ్‌‌ స్కిన్‌‌ సెల్స్‌‌ని పోగొడుతుంది.
  •   గ్లూకోనొలాక్టోన్‌‌తో చర్మంలో కెరటోలిటిక్‌‌ యాక్షన్‌‌ జరుగుతుంది. అది చర్మంపైన ఉండే డెడ్‌‌ స్కిన్‌‌ సెల్స్‌‌, ముడతల్ని పోగొడుతుంది. చర్మాన్ని హైడ్రేటెడ్‌‌గా ఉంచుతుంది. 
  •   గ్లూటాతియోన్‌‌ చర్మానికి యాంటీఆక్సిడెంట్‌‌ గా పనిచేస్తుంది. ఇది మెలనిన్‌‌ని తగ్గిస్తుంది. ఫ్రీ రాడికల్స్‌‌ని న్యూట్రల్ చేసి కొత్త కణాల ఉత్పత్తికి సాయపడుతుంది. డార్క్ స్పాట్స్‌‌ని తగ్గించి చర్మాన్ని మెరిపిస్తుంది.
  •   లాక్టిక్‌‌ యాసిడ్‌‌ ముడతలు, మచ్చలు, డెడ్‌‌ స్కిన్‌‌ సెల్స్‌‌ను పోగొడుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దాంతో చర్మం మెరుస్తుంది.