జియోలో వాటా కొన్న ఫేస్‌బుక్

జియోలో వాటా కొన్న ఫేస్‌బుక్

జియోలో రూ .43,574 కోట్లు పెట్టుబడి పెట్టిన ఫేస్‌బుక్

ప్రముఖ సోషల్ మీడియా కంపెనీ ఫేస్‌బుక్ రిలయన్స్ జియోలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో రూ .43,575 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఫేస్‌బుక్ ప్రకటించింది. ఈ పెట్టుబడితో రిలయన్స్ జియోలోని 9.99 శాతం వాటా ఫేస్‌బుక్ సొంతం చేసుకోనుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, జియో ప్లాట్‌ఫామ్ లిమిటెడ్ మరియు ఫేస్‌బుక్ ఇంక్ మూడు కలిసి పనిచేయాలని అనుకున్నాయని.. అందుకోసం జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఫేస్‌బుక్ పెట్టుబడి కోసం బైండింగ్ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది.

ఫేస్‌బుక్ పెట్టిన ఈ పెట్టుబడి జియో ప్లాట్‌ఫామ్‌లకు రూ .4.62 లక్షల కోట్ల ప్రీ-మనీ ఎంటర్‌ప్రైజ్ విలువకు సమానం. జనానికి తక్కువ ధరకే ఎన్నో ఫీచర్లు కలిగిన మొబైల్ ను అందించిన జియో కంపెనీలోకి ఫేస్‌బుక్ ఎంట్రీ ఇచ్చింది. మరి ఇప్పుడు ఈ రెండు కంపెనీలు కలిసి మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెస్తాయేమో చూడాలి.