ఇంతకుముందు బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో లిబ్రా పేరుతో క్రిప్టోకరెన్సీని తీసుకురావాలనుకుంది ఫేస్బుక్. దానికోసం దేశంలోని పెద్దపెద్ద కంపెనీలతో సంప్రదింపులు కూడా జరిపింది. కానీ, చాలా దేశాలు క్రిప్టో కరెన్సీపై బ్యాన్ పెట్టడంతో వెనక్కి తగ్గింది. అయితే ఇప్పుడు మెటాగా మారిన ఫేస్బుక్ మళ్లీ వర్చువల్ కరెన్సీ వైపు అడుగులేస్తోంది. అయితే ఈసారి సొంతంగా డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చే ఆలోచనలో ఉందట. అది కూడా మెటా ఛీప్ మార్క్ జుకర్ బర్గ్ పేరు మీద. ‘జుక్ బక్స్’గా పిలుస్తున్న ఈ డిజిటల్ కరెన్సీని ముందుగా గేమింగ్ ఇండస్ట్రీ ట్రాన్సాక్షన్స్లో ఉపయోగించనుంది మెటా. దాని రిజల్ట్‌ని బట్టి ఆన్‌లైన్‌కి ఈ కరెన్సీని పరిచయం చేయనుంది. కంటెంట్ క్రియేటర్స్‌కి రివార్డుగా ఈ కరెన్సీనే ఇవ్వాలను కుంటోందట. అయితే దీనిపై ఇప్పటి వరకు మెటా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
