త్వరలో ఫేస్‎బుక్ పేరు మార్పు!

త్వరలో ఫేస్‎బుక్ పేరు మార్పు!

ప్రస్తుత రోజుల్లో ఫేస్‎బుక్ అకౌంట్ లేనివాళ్లు చాలా అరుదు. ప్రతి ఒక్కరూ ఫేస్‎బుక్‎లో చాలా యాక్టివ్‎గా ఉంటుంటారు. ఈ ప్లాట్‎ఫామ్‎కు ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది ఖాతాదారులు ఉన్నారు. ఫేస్‎బుక్ ఆధ్వర్యంలోనే వాట్సాప్, ఇన్‎స్టాగ్రామ్ కూడా పని చేస్తున్నాయి. ఈ నెల 28న కంపెనీ వార్షికోత్సవం సందర్భంగా కనెక్ట్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారని వెర్జ్ అనే వెబ్‎సైట్ నివేదించింది. అంతేకాకుండా.. ఈ కాన్ఫరెన్స్‎లో ఫేస్‎బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఓ కీలక ప్రకటన చేయనున్నారని తెలిపింది. ఫేస్‎బుక్ కంపెనీని కొత్త పేరుతో రీబ్రాండ్ చేయాలని ఆయన ఆలోచిస్తున్నట్లు తెలిపింది. కాగా.. ఫేస్‎బుక్ పేరు మార్పుపై అధికారికంగా ఇప్పటివరకు ఎవరూ స్పందించలేదు.

For More News..

మరో 5 రోజుల్లో ఇంటర్ పరీక్షలు.. హాల్‎టికెట్లపై ప్రిన్సిపాళ్ల సంతకం అవసరం లేదు

యువకుడి ప్రాణం తీసిన రెండు గ్రామాల వివాదం