సిరిసిల్ల బల్దియాలో వర్గపోరు?...చైర్‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌ తీరుపై బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ కౌన్సిలర్ల అసంతృప్తి

సిరిసిల్ల బల్దియాలో వర్గపోరు?...చైర్‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌ తీరుపై బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ కౌన్సిలర్ల అసంతృప్తి

రాజన్నసిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు మొదలైంది. సిరిసిల్ల బల్దియాలో చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌, వైస్‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌కు వ్యతిరేకంగా కౌన్సిలర్లు మీటింగ్‌‌‌‌లు ఏర్పాటు చేసుకోవడం హాట్‌‌‌‌టాపిక్ గా మారింది. ఇటీవల జరిగిన మున్సిపల్​ఎన్నికల్లో సిరిసిల్ల బల్దియాలో 39 వార్డులకు గానూ, 27 మంది బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ కౌన్సిలర్లు గెలిచారు. చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌గా జిందం కళకు రెండోసారి అవకాశం ఇచ్చారు. దీంతో ఆ పదవిని ఆశించిన వారు అసంతృప్తిగా ఉన్నారు. వారం కింద బల్దియా మీటింగ్‌‌‌‌ జరగగా కౌన్సిలర్లంతా గైర్హాజరయ్యారు. 

ఓ మహిళ కౌన్సిలర్ బర్త్ డే పేరుతో వేరే సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. గతంలోనూ రహస్యంగా పెట్టుకున్న మీటింగ్‌‌‌‌లో చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌ తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ మీటింగ్‌‌‌‌లకు బీజేపీ, కాంగ్రెస్  కౌన్సిలర్లు సైతం హాజరైనట్లు సమాచారం. ఈ మీటింగుల్లో చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌, ఆమె భర్త ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ, కాంట్రాక్టు పనులను తన బంధువులు, అనుచరులకే కేటాయిస్తున్నారని పలువురు కౌన్సిలర్లు వాపోయినట్టు సమాచారం. 

కౌన్సిలర్లకు కేటీఆర్ క్లాస్?

కౌన్సిలర్ల తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్‌‌‌‌‌‌‌‌ క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. రెండు రోజుల కింద సిరిసిల్లలో జరిగిన బీఆర్ఎస్ మీటింగ్‌‌‌‌లో పార్టీకి కట్టుబడి పనిచేయాలని, రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించినట్లు సమాచారం.