పాలమూరు యూనివర్సిటీలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం

పాలమూరు యూనివర్సిటీలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీలో కాలేజీ ఆఫ్  ఎడ్యుకేషన్  ఆధ్వర్యంలో గ్లోబల్  సెంటర్  ఫర్  ది డెవలప్​మెంట్(యూఎస్ఏ) సహకారంతో ఫాకల్టీ డెవలప్​మెంట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. సోమవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పీయూ వీసీ శ్రీనివాస్  మాట్లాడుతూ జాతి నిర్మాణంలో ఉపాధ్యాయుడి పాత్ర కీలకమని పేర్కొన్నారు. సమాజంలో జరిగే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. రిజిస్ట్రార్  పూస రమేశ్ బాబు, రిసోర్స్  పర్సన్  షాలిని, కన్వీనర్  కరుణాకర్ రెడ్డి, కో కన్వీనర్  బషీర్ అహ్మద్  పాల్గొన్నారు.