చిన్న వయసులోనే సీఎం అయిన రెండో వ్యక్తి ఫడ్నవీస్.. మరి ఫస్ట్ ఎవరు?

చిన్న వయసులోనే సీఎం అయిన రెండో వ్యక్తి ఫడ్నవీస్.. మరి ఫస్ట్ ఎవరు?

మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రానికి అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయిన రెండో వ్యక్తిగా దేవేంద్ర ఫడ్నవీస్ రికార్డు సృష్టించారు. సీఎం అయ్యేనాటికి ఫడ్నవీస్ వయసు 44 ఏళ్లు . ఫడ్నవీస్ కంటే ముందు ‘నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ’ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ 38 ఏళ్ల వయసుకే ముఖ్యమంత్రి అయ్యారు. అంతేకాదు మహారాష్ట్ర కు బీజేపీ తొలి ముఖ్యమంత్రి కూడా ఫడ్నవీసే. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నాగ్​ పూర్ సౌత్ వెస్ట్ నుంచి ఆయన గెలిచి అదే ఏడాది అక్టోబరు 31న తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సారి ఎన్నికల్లో కూడా అదే నియోజకవర్గం నుంచి ఫడ్నవీస్ విజయం సాధించారు.