గణేష్ విగ్రహాన్ని ఇసుక కుప్పలో వదిలేసి పరార్

గణేష్ విగ్రహాన్ని ఇసుక కుప్పలో వదిలేసి పరార్

హైదరాబాద్ నగరంలోని డీఎల్ఆర్ఎల్ ( DLRL) కాలనీలో స్థానికులు ప్రతిష్టించిన గణేష్ విగ్రహాన్ని దుండగులు చోరికి యత్నించారు. రెండో రోజు రాత్రి పూజలు ముగిసిన తర్వాత నిర్వాహకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మూడో రోజు తెల్లవారు జామున మండపానికి వచ్చిన కొందరు వ్యక్తులు గణపతి విగ్రహాన్ని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. స్థానికులు చూసి అరవటంతో... విగ్రహాన్ని పక్కనే ఉన్న ఇసుక కుప్పలో వదిలేసి పారిపోయారు. గణేష్ విగ్రహం చోరీకి యత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మండప నిర్వాహకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.