యాంటీ కరప్షన్ కమిటీగా అధికారులుగా చెలామణి

యాంటీ కరప్షన్ కమిటీగా  అధికారులుగా చెలామణి

అల్వాల్, వెలుగు: యాంటీ కరప్షన్ కమిటీగా చెలామణి అవుతూ వసూళ్లకు పాల్పడుతున్న ఓ ముఠాను అల్వాల్ పోలీసులు అరెస్ట్​ చేశారు. బొల్లారం- – కొంపల్లి మార్గంలో సోమవారం రాత్రి అల్వాల్  పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్నారు. ఓ ఇన్నోవా వాహనం ముందు భాగంలో యాంటీ కరప్షన్ కమిటీ అని రాసి ఉంది. దీంతో పోలీసులు ఆ వాహనాన్ని ఆపి ప్రశ్నించగా డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి కారులో యాంటి కరప్షన్ ఆఫీసర్ ఉన్నట్లు చెప్పాడు. 

అందులో ఉన్న ఐదుగురి ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు విచారించారు. సికింద్రాబాద్ డివిజన్ యాంటీ కరప్షన్ కమిటీ ఇన్​చార్జిగా పనిచేస్తున్నట్లు వివరించారు. అయితే.. ఆఫీసర్​గా చెప్పుకున్న వ్యక్తికి డ్రంకెన్​ డ్రైవ్​ టెస్తు చేయగా మద్యం సేవించినట్లు గుర్తించారు. యాంటీ కరప్షన్ కమిటీ అంటూ ఏమీ లేదని పోలీసులు నిర్ధారణకు రావడంతో నిందితులు కారును వదిలి పారిపోయారు.  కారులో ఫేక్​ ఐడీ కార్డులు దొరికాయి. సదరు వ్యక్తులు యాంటీ కరప్షన్ కమిటీ పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.