21 ఏండ్లకే ఆర్మీ బ్రిగేడర్.. అసిస్టెంట్లుగా ఇద్దరు NSG కమాండోలు.. ఏం తెలివిరా సామీ నీది!

 21 ఏండ్లకే ఆర్మీ  బ్రిగేడర్.. అసిస్టెంట్లుగా ఇద్దరు NSG కమాండోలు..  ఏం తెలివిరా సామీ నీది!

ఇలాంటి వాళ్లు ఉత్తరప్రదేశ్, బీహార్ లోనే ఎందుకు ఉంటారబ్బా అనుకుంటారు ఈ వార్త చదివితే. రాత్రికి రాత్రే బ్రిడ్జిని ఎత్తుకెళ్లే వాళ్లు కొందరు.. మొబైల్ టవర్ ను మాయం చేసే వాళ్లు కొందరు. వీళ్లను మించిన దొంగ ఇతడు. చాలా ప్రొఫెషనల్ గా.. ఎవరికీ డౌట్ రాకుండా.. ఏకంగా ఆర్మీ బ్రిగేడర్ అవతారమెత్తాడు. 21 ఏళ్లకే బ్రిగేడర్ అయిన ఇతడు.. అసిస్టెంట్లుగా ఇద్దరు ఫేక్ ఎన్ఎస్జీ కమాండోలను నియమించుకోవడం ఆర్మీ అధికారులనే షాక్ కు గురిచేసింది. 

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ షాజహాన్ పూర్ లో.. 21 ఏళ్ల ఫేక్ ఆర్మీ ఆఫీసర్ ఆర్యన్ వర్మ దేశ వ్యాప్తంగా వైరల్ గా మారాడు. షాజహాన్ పూర్ పరిసర ప్రాంతాల్లో కమాండోలను పెట్టుకుని.. ఫేక్ ఆర్మీ వాహనంలో వెళ్తూ.. చేస్తున్న నానా హంగామాపై ఇండియన్ ఆర్మీ అధికారులు నిఘా పెట్టారు. షహీద్ మ్యూజియం దగ్గర చేసిన స్టింగ్ ఆపరేషన్ లో ఎట్టకేలకు దొంద దొరికాడు. 

ఉచ్చులో భలే పడ్డాడు:

ఏప్రిల్ నుంచి బ్రిగేడియర్ ఆర్మీ యూనిఫాంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నాడని సమాచారం అందడంతో, సైనిక అధికారులు, నిఘా సంస్థలు కొన్నాళ్లుగా నిఘా ఉంచాయి. ఫేక్ బ్రిగేడర్ ను పట్టుకునేందుకు అల్లిన ఉచ్చులో చాలా ఈజీగా పడిపోయాడు వర్మ.  ఆర్మీ ఉద్యోగాల  పరీక్షలకు ముందు, ఆశావహులకు ఇన్సిరేషన్ ఇస్తూ స్పీచ్ ఇవ్వాల్సిందిగా  వర్మను ఆర్మీ అధికారులు కోరారు. ఇందుకోసం షాజహాన్‌పూర్ కంటోన్మెంట్ లోపల ఉన్న షహీద్ మెమోరియల్‌ లో కార్యక్రమం ఏర్పాటు చేశారు. 

శుక్రవారం (జూన్ 12) ఉదయం వర్మ బ్రిగేడియర్ వేషంలో  కార్యక్రమానికి చేరుకున్నాడు. సీనియర్ ఆఫీసర్స్ ఉపయోగించే స్టార్స్, ఫ్లాగ్స్ ఉన్న ఎస్‌యూవీలో ప్రయాణిస్తున్నాడని అధికారులు తెలిపారు. కార్యక్రమానికి రాగానే సైనిక సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అతని డ్రైవర్ వద్ద నుంచి ఒక ఫేక్ ఐడెంటిటీ  కార్డును కూడా స్వాధీనం చేసుకున్నారు. 

ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ (సాయుధ దళాల) డీన్ ముద్ర ఉన్న ఒక ఐడీ కార్డును కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా ఒక ఆర్మీ రెజిమెంటల్ చేతికర్ర, ఒక డమ్మీ పిస్టల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.  ఎన్నో ఏళ్ల సేవలకు గానూ బ్రిగేడ్ పదవి రాదు ఆర్మీలో.. అలాంటిది 21 ఏండ్లకే ఫేక్ బ్రిగేడ్ అవతారం ఎత్తి అధికారులను ఆశ్చర్యానికి గురిచేశాడు. అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.