- ఆరుమంది నిందితులు రిమాండ్, పరారీలో మరో ఇద్దరు
- మీడియాకు తెలిపిన మల్కాజిగిరి డీసీపీ పద్మజారెడ్డి
ఉప్పల్, వెలుగు: ఓ రియల్టర్ పై అటెంప్ట్ మర్డర్ ఫేక్ అని తేలడంతో ఆరుమంది నిందితులను ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. గురువారం మల్కాజిగిరి డీసీపీ పద్మజారెడ్డి ఉప్పల్ పీఎస్ లో మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. బోడుప్పల్ కు చెందిన భాస్కర్ గౌడ్ రియల్టర్. అంతకుముందే అతనిపై నాచారం, కీసర, మాదాపూర్, మేడిపల్లి పీఎస్ ల్లో క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి.
2018లో ఓ మర్డర్ కేసులో మేడిపల్లి పోలీసులు రౌడీషీట్ కూడా ఓపెన్ చేశారు. అయితే.. భాస్కర్ గౌడ్ తన సెక్యూరిటీ కోసం పోలీసు గన్ మెన్లను పొందేందుకు అటెంప్ట్ మర్డర్ కు ఫ్రెండ్స్ శివ గౌడ్, మిరపకాయల సంతోష్ రెడ్డితో కలిసి ప్లాన్ చేశారు. గత నెల 24న ముగ్గురూ కలిసి తెలిసిన మరో ఐదుమందితో ఉప్పల్ భగాయత్ లో అటెంప్ట్ మర్డర్ అటాక్ చేయించారు.
ఆ తర్వాత ఉప్పల్ పీఎస్ లో కంప్లయింట్ చేసి హాస్పిటల్ లో అడ్మిన్ అయి.. అక్కడ నానా హంగామా చేశారు. పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా భాస్కర్ గౌడ్ ఫేక్ అటెంప్ట్ మర్డర్ చేయించుకున్నట్టు తేల్చారు. అతడే సుపారికి రూ. 2 లక్షల 50 వేల ఇచ్చినట్టు ఒప్పుకున్నట్టు డీసీపీ తెలిపారు. ఎనిమిది మంది లో ఆరుగురిని అరెస్టు చేశామని , సంతోశ్‌రెడ్డి, మహేశ్పరారీలో ఉన్నారని సెర్చ్ చేస్తున్నామని డీసీపీ తెలిపారు.
