ఫ్లాట్‌లు ,పెట్టుబడి పేరుతో రూ.300 కోట్లు టోక‌రా

ఫ్లాట్‌లు ,పెట్టుబడి పేరుతో  రూ.300 కోట్లు టోక‌రా

దాదాపు వెయ్యి మంది బాధితులు

హైదరాబాద్ : ‘‘తక్కువ ధరకే ఫ్లాట్ ఇప్పిస్తాం. మా కంపెనీలో ఇన్వెస్ట్​ చేయండి, ఎక్కువ వడ్డీ చెల్లి స్తాం’’ అంటూ ఓ సంస్థ రూ.300 కోట్లు కొల్లగొట్టిం ది. పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. మాదాపూర్ కి చెందిన రఘు, విజయవాడకి చెందిన నివాస్​బాబు మాదాపూర్ లో స్వదాద్రి కంపెనీ ఓపెన్‌‌ చేశారు. తక్కువ రేటుకే ప్లాట్లు, ఫ్లాట్లు​ఇప్పి స్తామంటూ పలువురి దగ్గర రూ.10లక్షల నుంచి రూ.40లక్షల దాకా వసూలుచేశారు. డబ్బు చెల్లించాక రెస్పాం డ్ అవడం లేదు. ఆఫీస్​కు వెళ్తే మూసి ఉంటోంది. మరోవైపు ఎక్కువ వడ్డీ ఇస్తామంటూ అనేక మంది నుంచి లక్షల రూపాయలు తీసుకున్నారు. మూడు, నాలుగు నెలలు వడ్డీ చెల్లించి, ఆ తర్వాత తిప్పించుకుని తిరుగుతున్నారు. ఇలా 4 రోజుల నుంచి మాదాపూర్ పీఎస్​కు వందల్లో కంప్లయింట్లు వచ్చాయి. రఘును పోలీసులు అరెస్ట్‌‌ చేసి విచారిస్తున్నారు. బాధితుల్లో ప్రభుత్వాధి కారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కువమంది సాఫ్ట్​వేర్, ప్రైవేట్ ఉద్యో గులు ఉన్నారు. దాదాపు వెయ్యి మంది ఇన్వెస్ట్​ చేసినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. కేసును సీఐడీకి అప్పగించనున్నట్లు తెలిసింది.

fake company that defrauded of Rs 300 crore in the name of flat for sale in hyderabad