
బషీర్‌బాగ్, వెలుగు: బ్లింక్ ఇట్ కస్టమర్ కేర్ కు ఫోన్ చేయబోయి ఓ వ్యక్తి స్కామర్ల ఉచ్చులో పడ్డాడు. టోలిచౌకి ప్రాంతానికి చెందిన 64 ఏళ్ల వృద్ధుడు ఆన్లైన్ లో బ్లింక్ ఇట్ యాప్ ద్వారా సరుకులను ఆర్డర్ చేశాడు.
ఆర్డర్ అందుకున్న తరువాత ఒక వస్తువు మిస్సింగ్ ఉండటంతో.. గూగుల్ లో బ్లింక్ ఇట్ కస్టమర్ కేర్ నంబర్ కోసం సెర్చ్ చేశాడు. అందులో స్కామర్స్ పెట్టిన నంబర్‌కు పొరపాటున ఫోన్ చేశాడు. స్కామర్లు నిజమైన కస్టమర్ కేర్ ప్రతినిధులుగా నటించి బాధితుడి ఫోన్‌పే, ఇతర వివరాలు తీసుకున్నారు.
కాసేపటి తరువాత అతని అకౌంట్ నుంచి రూ.1,40,024 డెబిట్ అయ్యాయి.