
రాచకొండలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. నకిలీ బంగారం ముఠా గుట్టు రట్టయ్యింది. తక్కువ ధరకు భారీ బంగారాన్ని ఇప్పిస్తామంటూ మోసం చేసింది సదరు ముఠా. ఈ భారీ స్కాంకు పాల్పడ్డ నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న రాచకొండ పోలీసులు.ఈ కేసును ఛేదించిన పోలీసులు 51 మంది వద్ద నగదు, సుమారు 5 కేజీల నకిలీ బంగారం, దాదాపు 6 కోట్ల నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి.
అత్యాశకు పోయి ఇలాంటి మాయమాటలు నమ్ముతే ఏమవుతుందో మరోసారి రుజువైంది. ఈజీ మని, తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం అంటూ అత్యాశకు పోయి కష్టపడి దాచుకున్న సొమ్మును దొంగలపాలు చేస్తున్నారు చాలా మంది. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా కూడా ఇంకా జనం మోసపోతూనే ఉన్నారు.