వనపర్తి ఎమ్మెల్యే పేరిట ఫేక్ ఇన్ స్టా అకౌంట్ ...మెసేజ్ లు, వీడియోలు పంపుతూ డబ్బులు వసూలు

వనపర్తి ఎమ్మెల్యే పేరిట ఫేక్ ఇన్ స్టా అకౌంట్ ...మెసేజ్ లు, వీడియోలు పంపుతూ డబ్బులు వసూలు

వనపర్తి, వెలుగు : గుర్తు తెలియని వ్యక్తులు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేరిట ఫేక్ ఇన్​స్టాగ్రామ్ అక్కౌంట్ క్రియేట్ చేశారు. అందులో ఎమ్మెల్యేనే మాట్లాడుతున్నట్లు మెసేజ్ లు వీడియోలు పంపుతూ డబ్బులు వసూలు చేస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. ఇది తెలిసిన ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫేక్ అకౌంట్ గా గుర్తించారు.  తన పేరిట వచ్చే ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​కు ఎవరూ స్పందించొద్దని సూచించారు. ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిన వ్యక్తుల గురించి  తన దృష్టికి గాని, లేదా లోకల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని కోరారు.