ఇంట్లో చొరబడి మహిళను కత్తితో బెదిరించి.. పెప్పర్ స్ప్రే కొట్టి చైన్ స్నాచింగ్

ఇంట్లో చొరబడి మహిళను కత్తితో బెదిరించి.. పెప్పర్ స్ప్రే కొట్టి చైన్ స్నాచింగ్
  • మియాపూర్​ ప్రేమ్​నగర్​లో ఘటన

హైదరాబాద్​సిటీలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు.మునుపటిలా రోడ్లపై ఒంటిరి మహిళల మెడలోంచి గొలుసులు లాక్కెళ్లడమే కాకుండా, ఇప్పుడు ఏకంగా ఇళ్లలోకి చొరబడి దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా మియాపూర్‌లో ఇంటర్నెట్ రిపేర్ పేరుతో వచ్చిన ఓ దుండగుడు, మహిళను కత్తితో బెదిరించి గొలుసు ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపుతోంది.

మియాపూర్ ప్రేమ్ నగర్ ప్రాంతానికి చెందిన లక్ష్మి అనే మహిళ సోమవారం సాయంత్రం తన ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో ఒక వ్యక్తి ఆమె ఇంటికి వచ్చాడు. తాను ఇంటర్నెట్ టెక్నీషియన్ అని, మీ ఇంట్లో నెట్‌వర్క్ సమస్య ఉందని, దాన్ని సరిచేయడానికి వచ్చానని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన లక్ష్మి అతడిని ఇంట్లోకి అనుమతించింది.

కత్తితో బెదిరింపు.. పెప్పర్ స్ప్రేతో దాడి

ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే చైన్ స్నాచర్​వెంట తెచ్చుకున్న  కత్తితో లక్ష్మిని బెదిరించాడు. ఆమె ప్రతిఘటించడంతో వెంట తెచ్చుకున్న పెప్పర్ స్ప్రేని ఆమె కళ్లలోకి కొట్టాడు. లక్ష్మి విలవిల్లాడుతుండగా కిందపడిపోయింది. ఆమె మెడలోని బంగారు గొలుసును బలంగా లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు.

బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక ఆధారాలు సేకరించారు. నిందితుడు ఏ మార్గంలో వెళ్లాడనేది గుర్తించడానికి ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.