హైదరాబాద్లో నకిలీ ఐఫోన్ యాక్ససిరీస్ పట్టివేత..ఐదుగురు అరెస్ట్

హైదరాబాద్లో నకిలీ ఐఫోన్ యాక్ససిరీస్ పట్టివేత..ఐదుగురు అరెస్ట్

ప్రముఖ యాపిల్ ఐ ఫోన్ డుప్లికేట్ యాక్ససిరీస్ విక్రయిస్తున్న సెల్ ఫోన్ షాపులపై సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్స్ చేశారు. అబిడ్స్ జగదీష్ మార్కెట్లోని మాతాజీ, ఆర్.జి. మొబైల్, రాజారామ్, న్యూ డ్రీమ్స్ సెల్ ఫోన్ షాపులపై ఆదివారం(మే25) దాడులు నిర్వహించిన పోలీసులు పెద్ద ఎత్తున డుప్లికేట్ ఐఫోన్ యాక్ససిరీస్ ను స్వాధీనం చేసుకున్నారు. 

నకిలీ యాపిల్ బ్యాటరీలు, ఛార్జర్స్, మదర్ బోర్డు ఇతర పలు పరికరాలను స్వాధీనం చేసుకుని ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. విక్రమ్ సింగ్, సురేష్ కుమార్, మహ్మద్ సర్ఫరాజ్, నాతురామ్ చౌదరి, మహ్మద్ అర్షద్ లు నకిలీ లను ఒరిజినల్ పేరిట విక్రయిస్తున్న ప్రజలను మోసం చేస్తున్నారు. 

ALSO READ | ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అవతారం..ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తామని మోసం..సూడో పోలీస్ అరెస్ట్

విషయం తెలుసుకున్న యాపిల్, ఐఫోన్ కంపెనీ ప్రతినిధుల సమాచారం మేరకు వారిని అరెస్టు చేసి లక్షల విలువైన నకిలీ పరికరాలను సీజ్ చేశారు. కేసు దర్యాప్తు నిమిత్తం అబిడ్స్ పోలీసులకు అప్పగించారు. కాపీ రైట్స్ యాక్ట్, ఫోర్జరి సెక్షన్ల కింద  కేసును నమోదు చేసిన అబిడ్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.