సీఎం కేసీఆర్‌ను క్షమాపణ కోరుతూ ఈటల ఫేక్ లెటర్

సీఎం కేసీఆర్‌ను క్షమాపణ కోరుతూ ఈటల ఫేక్ లెటర్

భూకబ్జా ఆరోపణలతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఈ క్రమంలో ఈటల.. సీఎం కేసీఆర్ మీద కొన్ని ఆరోపణలు చేశారు. అయితే తాజాగా ఈటల.. సీఎం కేసీఆర్‌ను క్షమాపణ కోరినట్లుగా ఒక లెటర్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఈ లెటర్ మీద ఈటల అనుచరులు స్పందించారు. ఆ లెటర్ ఒక ఫేక్ లెటర్ అని, దానికి ఈటల రాజేందర్‌కు సంబంధంలేదని ఆయన అనుచరులు అన్నారు. ఈటల.. సీఎం కేసీఆర్‌ను క్షమాపణ కోరినట్లుగా వైరల్ అవుతున్న లెటర్ మీద ఆయన అనుచరులు, బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేసి.. ఈ ఫేక్ లెటర్ సృష్టించిన వారిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.