జగిత్యాల జిల్లాలో నకిలీ మావోయిస్టుల పేరిట బెదిరింపు లేఖలు

జగిత్యాల జిల్లాలో నకిలీ మావోయిస్టుల పేరిట బెదిరింపు లేఖలు

జగిత్యాల జిల్లాలో నకిలీ మావోయిస్టుల పేరిట బెదిరింపు లేఖలు కలకలం రేపాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీర్పూర్ లో రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి బెదిరింపు లేఖను తయారు చేయించి..బహిరంగ ప్రదేశాల్లో అంటించాడు. 60 గజాల స్థలం కోసం తాను.. మావోయిస్టుల పేరిట లేఖలు ముద్రించినట్లు పోలీసులు తెలిపారు. ఇవే లేఖలను ఓ వ్యక్తి గోడలకు అంటిస్తుండగా సీసీ కెమెరాల్లో రికార్డుకావడంతో అతను అడ్డంగా బుక్కయాడు.

సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని.. అన్ని కోణాల్లో ప్రశ్నించారు. నిందితుడితో పాటు అతనికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిద్దరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటన వెనుక ఇంకెవరైనా ఉన్నారా..? అనే కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు.