సీబీఎస్ఈ పరీక్ష పేపర్ల లీకేజీపై సోషల్ మీడియాలో పుకార్లు

సీబీఎస్ఈ పరీక్ష పేపర్ల లీకేజీపై సోషల్ మీడియాలో పుకార్లు

10, 12 తరగతుల బోర్డు ఎగ్జామ్ పేపర్లు లీక్ అయినట్లు సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న వార్తలను సీబీఎస్ఈ బోర్డు ఖండించింది. అవన్నీ ఉత్త పుకార్లేనని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని, విద్యార్థులు.. పేరెంట్స్ భయపడాల్సిన అవసరం లేదని సూచించింది.

పరీక్ష పేపర్లు లీక్ అయినట్లు సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న వదంతులకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీబీఎస్ఈ ఉన్నతాధికారులు తెలిపారు. ఫేస్‌బుక్ సహా పలు సామాజిక మాధ్యమాల్లో ఈ ఫేక్ న్యూస్‌ను సర్క్యులేట్ చేస్తున్న వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరుతూ ఢిల్లీ పోలీసులకు లేఖ రాసినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో పుకార్లు ప్రచారం చేస్తూ.. విద్యార్థులు, పేరెంట్స్‌లో భయాందోళనలు క్రియేట్ చేస్తున్న వారిని గుర్తించి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు.

 

సీబీఎస్ఈ పరీక్ష పేపర్ల లీకేజీపై సోషల్ మీడియాలో పుకార్లు