- మూడు రోజుల్లో రెండు లింకులు
- ‘సంచార్సాథి’కి ఫిర్యాదు
హైదరాబాద్ సిటీ, వెలుగు: ‘స్పీడ్ కెమెరా మీ వాహనం వేగంగా వెళ్తున్నట్లు గుర్తించింది. ఈ లింక్క్లిక్ చేసి వివరాలు తెలుసుకోండి’ అంటూ ఖైరతాబాద్జోన్డీసీపీ శిల్పవల్లికి సైబర్ నేరగాళ్లు ఓ మెసేజ్పంపి డబ్బులు కొల్లగొట్టాలని ప్లాన్వేశారు. వారి పన్నాగాన్ని గుర్తించిన ఐపీఎస్ శిల్పవల్లి జనాలకు అవగాహన కల్పించడం కోసం ఆ మెసేజ్లను స్క్రీన్షాట్తీసి ఎక్స్ లో పోస్ట్ చేశారు.
‘2026 జనవరి 10న మీ వాహనం ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు రికార్డయ్యింది. లింకు క్లిక్చేసి పూర్తి వివరాలు చూడండి. జాగ్రత్తగా వాహనం నడపండి..ట్రాఫిక్ మేనేజ్మెంట్ అంటూ నాకు 96782.... అనే నెంబర్ నుంచి మూడు రోజుల్లో రెండు మెసేజెస్వచ్చాయి. వాటిని నేను క్లిక్ చేయలేదు’ అని ఆమె రాశారు.
దీనిపై ఆమె సంచార్ సాథీ వెబ్ సైట్ లో ఫిర్యాదు చేశారు. ప్రజలు కూడా తనకు వచ్చినట్టే అనుమానాస్పద మెసేజ్ లు వస్తే.. లింక్ క్లిక్ చేయకుండా https://www.sancharsaathi.gov.in/ లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
