తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి

తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి
  • రంగారెడ్డి జిల్లా బాచారంలో ఘటన

అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: కల్లు తీసేందుకు తాటిచెట్టు ఎక్కిన గీత కార్మికుడు ప్రమాదవశాత్తు జారిపడి చనిపోయాడు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాచారం గ్రామానికి చెందిన అబ్బగోని శంకరయ్య గౌడ్(60) రోజూలాగే సోమవారం ఉదయం కల్లు తీసేందుకు వెళ్లాడు. మధ్యాహ్నమైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్​చేశారు. స్పందించకపోవడంతో గ్రామశివారులో శంకరయ్య కోసం వెతికారు. 

సాయంత్రం 5 గంటల సమయంలో బాచారం చాకలిబండ ప్రాంతంలో తాటిచెట్టు కింద తీవ్ర గాయాలతో చనిపోయి పడి ఉన్నాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్​కు తరలించారు. కేసు ఫైల్​చేసినట్లు ఇన్​స్పెక్టర్​అంజిరెడ్డి తెలిపారు.