జగిత్యాల హాస్పిటల్లో వర్షానికి కూలిన సీలింగ్ పెచ్చులు

జగిత్యాల హాస్పిటల్లో వర్షానికి కూలిన సీలింగ్ పెచ్చులు

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలతో ప్రధాన రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. దారులన్నీ జలయమయం కావడంతో..జనం ఇండ్ల నుంచి బయట అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. 

జగిత్యాలలోని మాతా శిశు కేంద్రంలో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షాల కారణంగా నానిపోయిన పీఓపీ సీలింగ్ పెచ్చులు ఊడి పడ్డాయి. అయితే ఎవరికి ఎలాంటి హానీ జరగలేదని హాస్పిటల్ సిబ్బంది తెలిపారు. పేషెంట్లను వేరే వార్డులోకి తరలించామన్నారు. హాస్పిటల్ ప్రారంభించి ఆరు నెలలు కూడా కాలేదని స్థానికులు చెబుతున్నారు. అప్పుడే నాణ్యతా లోపాలు బయటపడ్డాయన్నారు. 

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కుండపోత వానలు పడుతున్నాయి. రెండు రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో..నిర్మల్ జిల్లా బాసరలోని రవీంద్రాపూర్ కాలనీ నీటమునిగింది. దీంతో కాలనీ వాసులను తెప్పల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. భారీ వర్షాలతో జిల్లాలోని ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. కడెం ప్రాజెక్ట్ మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. గడ్డెన్న వాగు ప్రాజెక్టు భారీగా ఇన్ ఫ్లో కొనసాగుతుంది. బాసర మండలం బిద్రెల్లి దగ్గర వాగు పొంగడంతో..నిర్మల్- నిజామాబాద్ జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.