దాస్ కా ఇలాఖా.. ఫ్యామిలీ ధమాఖా..విశ్వక్ ఫ్యామిలీ షో ప్రోమో సాంగ్ రిలీజ్

దాస్ కా ఇలాఖా.. ఫ్యామిలీ ధమాఖా..విశ్వక్ ఫ్యామిలీ షో ప్రోమో సాంగ్ రిలీజ్

కొత్త కొత్త కంటెంట్ తో ప్రేక్షకులను తెగ ఎంటర్టైన్ చేస్తున్న ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా(Aha). మరో కొత్త కాన్సెప్ట్ తో, కొత్త హోస్ట్ తో ఆడియన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే అన్ స్టాప‌బుల్ విత్ NBK(Unstopable with NBK) టాక్ షోతో నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)ను హోస్ట్ గా మార్చి సూపర్ సక్సెస్ సాధించిన ఆహా.. ఇప్పుడు తన కొత్త ఫ్యామిలీ షో కోసం మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Viswak sen) ను హోస్ట్ గా మార్చేసింది. 

లేటెస్ట్ గా ఈ షో నుంచి ప్రోమో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్..తెలుగులో స్వాగతం..జరిగే ఈ సంబరం..గురుతే ఈ సంతకం..నవ్వే నవ్వులో మాజా..అంటూ పూర్ణచారీ రాసిన లిరిక్స్ ఫ్యామిలీ ధమాకా షోకి వెల్కమ్ చెప్పింది. దాస్ కా ఇలాఖా.. ఫ్యామిలీ ధమాఖా..అంటూ విశ్వక్ చేసిన డ్యాన్స్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది.ఈ సాంగ్కు లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందించగా.. దీపక్ బ్లూ పాడారు. 

ఇక ఈ షోలో పాల్గోనే ఒక లేడీ విశ్వక్ మూవీస్ మీద డైలాగ్ చెబుతూ..ఈ నగరానికి ఏమైంది? అంటూ అందరినీ ప్రశ్నిస్తూ..ఫలక్ నామ దాస్ తో ఫేమస్ అయిపోయి..మిమ్మల్ని అందరూ పాగల్ అంటారా..? నేను ఒప్పుకోను..అంటూ ఆడియన్స్ను ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీ ధమాకా గేమ్ షో ఎప్పుడు మొదలు కానుందో అప్‌డేట్ ఇవ్వనప్పటికీ..సెప్టెంబర్ ప్రారంభంలో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.

గ్లోబల్ లెవల్లో సూపర్‌ హిట్ అయినా ఫ్యామిలీ గేమ్ షో ఆధారంగా ఈ షోని డిజైన్ చేశారు నిర్వాహకులు. కానీ ఈ షో కాన్సెప్ట్ ఏంటి? ఎపిసోడ్స్ ఎన్ని ఉంటాయి? అనే వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. కానీ సాంగ్ చూస్తుంటే ఈ షో కూడా అన్ స్టాప‌బుల్ విత్ NBK షోలాగే సూపర్ హిట్ కానుందని  క్లియర్గా అర్థమవుతోంది.