వర్షాలకు నేలమట్టమైన ఆవాసం.. ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు

వర్షాలకు నేలమట్టమైన ఆవాసం.. ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కంకల్ గ్రామంలో ఓ నిరుపేద కుటుంబం పరిస్థితి దయనీయంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలతో ఇళ్ళు కూలి బ్రాత్రూమే వారికి ఆశ్రయమయ్యింది. కంకల్ గ్రామానికి చెందిన కుమార్, కనకమ్మ దంపతులు రోజు కూలీలుగా పని చేస్తూ కాలం వెల్లదీస్తున్నారు. వీరికి మూడేళ్ల కూతురు కూడా ఉంది.  తమకున్న దాదాపు 50 చదరపు గజాల పురాతన ఇంట్లో నివాసముంటున్న ఆ కుటుంబం..  ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు అంతంత మాత్రంగా ఉన్న ఇళ్లు కాస్తా నేలమట్టమైంది. దీంతో ఆ నిరుపేద కుటుంబానికి బాత్రూమే ఆశ్రయమైంది. ఆరు బయట వంటచేసుకుంటూ, బాత్రూంలోనే వస్తువులను దాచుకొని కూలీకి వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొంది. అందరూ అయ్యో పాపం అనేవారే కాని.... అదుకునేవారే కరువయ్యారని ఆ కుటుంబం తల్లడిల్లుతోంది. నిలువనీడ లేని తమను అదుకోవాలని వేడుకుంటుంది. ఇలాంటి నిరుపేదలను ప్రభుత్వం ఆదుకోవాలని.... అధికారులు స్పందించి కుటుంబానికి ఆశ్రయం కల్పించేందుకు కృషి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.