పేదల సంక్షేమం కోసమే ఇంటింటి సర్వే

పేదల సంక్షేమం కోసమే ఇంటింటి సర్వే
  • ఏఐసీసీ మెంబర్​ డాక్టర్​ కోట నీలిమ

సికింద్రాబాద్, వెలుగు: రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పేద ప్రజల బాగు కోసమేనని ఏఐసీసీ సభ్యురాలు డాక్టర్​ కోట నీలిమ అన్నారు. ఆమె మంగళవారం సనత్​నగర్​లో మీడియాతో మాట్లాడుతూ..  ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్  సమగ్ర సర్వేను తప్పుబట్టడం సరికాదన్నారు. ఈ సర్వేపై తలసానికి  ఎలాంటి అనుమానాలు ఉన్నా నివృత్తి చేస్తామన్నారు.  ఆధార్ కార్డు లేకుండా దేశంలో ఎలాంటి గుర్తింపు లేదన్నది ఎమ్మెల్యేకు తెలియకపోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు.  బ్యాంక్ ఖాతాలు, రైతు పథకాలు, ఆదాయపు పన్ను లాంటి అన్ని చోట్ల ఆధార్ కార్డు అవసరమని ఆయన గ్రహించకపోవడం సిగ్గుచేటన్నారు. సర్వేపై ప్రజలకు అనుమానాలు  కలిగించడానికి ప్రయత్నం చేయొద్దని కోరారు.