బీజేపీలోకి అనంత్ నాగ్

బీజేపీలోకి అనంత్ నాగ్

ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి అనంత్ నాగ్ ఈరోజు (ఫిబ్రవరి 22) బీజేపీలో చేరనున్నారు .  సాయంత్రం 4.30 గంటలకు బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు . గతంలో జె.హెచ్ పటేల్ హయంలో ఈయన పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో చామరాజ్‌పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జేడీఎస్‌ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. ఇక అప్పటినుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్న అనంత్ నాగ్ మళ్లీ పాలిటిక్స్ లో యాక్టీవ్ అయ్యారు. అందులో భాగంగా బీజేపీలో చేరనున్నారు. 1973 నుంచి సినిమాల్లో నటిస్తున్న అనంత్ నాగ్ కన్నడ, తమిళ్, తెలుగు, మలయాళ బాషల్లో 196 సినిమాల్లో నటించారు. ఇక కేజీఎఫ్ చిత్రంలో హీరో స్టోరీ చెప్పే పాత్రలో కనిపించారు.