వీడియో: భార్యకు గేటు ముందు డెలివరీ చేసిన ఫుట్‌బాల్ ప్లేయర్

వీడియో: భార్యకు గేటు ముందు డెలివరీ చేసిన ఫుట్‌బాల్ ప్లేయర్

బ్రెజిల్ ఫుట్‌బాల్ ప్లేయర్ బ్రయాన్ బోర్గెస్ తన భార్యకు పేవ్‌మెంట్‌పై డెలివరీ చేశాడు. ఫుట్‌బాల్ ప్లేయర్ బ్రయాన్ బోర్గెస్ (24), మైలెనా (26) దంపతులు. వీరు బ్రెజిల్‌లోని రెసిఫేలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. ప్రస్తుతం మైలెనా నిండు గర్భవతి. ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్దామని ఇంటి నుంచి వస్తుండగా ఆమెకు ఉన్నట్లుండి నొప్పులు వచ్చాయి. అక్టోబర్ 1న ఈ దంపతులు ఎలివేటర్ నుంచి బయటకు వచ్చి గేట్ దగ్గరకి రాగానే మైలెన్‌కు పెయిన్స్ ఎక్కువయ్యాయి. మైలెన్ నడవడానికి కూడా ఇబ్బంది పడుతుండటంతో.. బ్రయాన్ ఆమెను ఎత్తుకొని కారు వద్దకు తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. కానీ, గేట్ దగ్గరికి వెళ్లే లోపే.. ఆమె పరిస్థితి తీవ్రంగా మారింది. ఆమె నిలబడటానికి కూడా ఓపిక లేనట్లుగా మారడంతో.. అక్కడే పేవ్‌మెంట్ మీద పడుకోబెట్టాడు. భార్య పెయిన్స్ చూడలేని బ్రయాన్ మంత్రసానిగా మారి.. భార్యకు ఆయనే పురుడు పోశాడు. ఆ దంపతులకు అక్కడే పండంటి కూతురు పుట్టింది. అది గమనించిన అపార్ట్‌మెంట్ వాసులు బ్రయాన్‌కు సాయం చేశారు. వారి సాయంతో బ్రయాన్.. తన భార్య మైలెన్‌ను మరియు అప్పుడే పుట్టిన కూతురిని ఆస్పత్రికి తరలించాడు. వారిద్దరూ ప్రస్తుతం క్షేమంగానే ఉన్నట్లు బ్రయాన్ తెలిపాడు. తన కూతురు పుట్టడం ఒక అద్బుతంలాగా జరిగిందని బ్రయాన్ తెలిపాడు.

For More News..

కరోనా నుంచి కోలుకున్న మిల్కీ బ్యూటీ

‘మోస్ట్ డేంజరస్ సెలబ్రిటీ’ జాబితాలో బాలీవుడ్ హీరోయిన్లు

రాష్ట్రంలో మరో 1,983 కరోనా కేసులు