
కన్నడ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత కేసీఎన్ మోహన్(61) ఆదివారం బెంగళూరులోని ఆయన నివాసంలో కన్నుమూశారు. కన్నడ ఇండస్ట్రీలో వరుస సినిమాలు తీసి స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగిన ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
కాగా.. కేసీఎన్ మోహన్‌కు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గతేడాది కేసీఎన్ మోహన్ సోదరుడు కేసీఎన్ చంద్రశేఖర్ మృతి చెందారు. ఆ దుఃఖం నుంచి ఇప్పుడిప్పుడే కుటుంబ సభ్యులు కోలుకుంటున్న సమయంలో.. మోహన్ మృతి చెందడం కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.