సోను సూద్ జీ.. నా పెళ్లికి స్పాన్సర్ చేయరూ!

సోను సూద్ జీ.. నా పెళ్లికి స్పాన్సర్ చేయరూ!
  • అభిమాని రిక్వెస్ట్‌కు ఫన్నీగా జవాబిచ్చిన యాక్టర్

ముంబై: కరోనా కష్ట కాలంలో బాలీవుడ్ యాక్టర్ సోను సూద్ ఎంతోమందిని ఆదుకున్నడు.. సొంత ఆస్తులు తాకట్టు పెట్టి మరీ ఆపదలో ఉన్నోళ్లకు సాయం చేసిండు. సినిమాలలోనే తాను విలన్.. రియల్ లైఫ్లో హీరో అని చాటుకున్నడు. సోషల్ మీడియా ద్వారా వచ్చిన రిక్వెస్ట్లను పరిశీలించి, నిజంగా అవసరమైన వాళ్లకు సోను సూద్ వెంటనే సాయం చేశాడు. అప్పుడప్పుడు ఫ్యాన్స్ ఫన్నీగా రిక్వెస్ట్ పెడితే అంతకన్నా ఫన్నీగా రిప్లై ఇస్తుంటాడు. తాజాగా అలాంటిదే ఓ సంఘటన జరిగింది. ఓ అభిమాని సోనును ఉద్దేశించి ‘నా పెళ్లికి మీరు స్పాన్సర్ చేస్తారా?’ అని రిక్వెస్ట్చేస్తూ ట్వీట్ పెట్టిండు. దీనికి జవాబుగా.. ‘స్పాన్సర్షిప్ మాత్రమే కాదు. మీ పెళ్లిలో మంత్రాలు కూడా నేనే చదువుతా. మీరు చేయాల్సిందల్లా జస్ట్ అమ్మాయిని వెతుక్కోవడమే’ అని ట్వీట్ చేసిండు. సోనుసూద్ రిప్లైకి ఆ అభిమానితో పాటు నెటిజన్లు కూడా నవ్వుకున్నరు. అంతకుముందు ‘సార్ నాకు మాల్దీవ్స్ వెళ్లాలని ఉంది. కాస్త సాయం చేయండి’ అంటూ మరో అభిమాని ట్వీట్ చేయగా.. ‘సైకిల్పై వెళ్తావా లేకుంటే రిక్షా తొక్కుకుంటనా.. ఏంగావాలె తమ్మీ’ అంటూ కౌంటర్ ఇచ్చిండు. కాగా, ఇటీవల మహా శివరాత్రి పండుగ సందర్భంగా సోనుసూద్ చేసిన ఓ ట్వీట్ వివాదానికి దారితీసింది. మహా శివుడి ఫొటోను ఫార్వార్డ్ చేయడం ద్వారా పండుగ జరుపుకోవడం కాదు.. అవసరమున్న వారిని ఆదుకోవడం ద్వారా జరుపుకోండంటూ సోను ట్వీట్ చేసిండు. అయితే, పండుగను ఎలా జరుపుకోవాలో చెప్పడానికి నువ్వెవరంటూ కొంతమంది నెటిజన్లు ఆయనపై మండిపడగా.. మరికొందరు మాత్రం సోనుసూద్కు మద్దతుగా నిలిచారు.