ఫ్యాన్సీ నెంబర్‌‌‌‌ల వేలంలో రూ.42 లక్షల ఆమ్దానీ

 ఫ్యాన్సీ నెంబర్‌‌‌‌ల వేలంలో రూ.42 లక్షల ఆమ్దానీ
  • ఖైరతాబాద్‌‌‌‌ ఆర్టీఏలో రూ.12 లక్షలు పలికిన 9999 నెంబర్

హైదరాబాద్​ సిటీ, వెలుగు: వాహనదారులకు ఫ్యాన్సీ నెంబర్లపై క్రేజ్​తగ్గడం లేదు. ఎన్ని లక్షలు చెల్లించడానికైనా కొందరు వాహనదారులు సిద్ధమవుతున్నారు. తాజాగా శుక్రవారం ఖైరతాబాద్​ఆర్టీఏ కార్యాలయంలో ఫ్యాన్సీ నెంబర్ల కోసం నిర్వహించిన వేలంలో ఆర్టీఏకు రూ.42,10,844 ఆదాయం వచ్చిందని జేటీసీ రమేశ్​కుమార్​ తెలిపారు. టీజీ 09ఎఫ్​ 9999 నెంబర్‌ను కీస్టోన్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ రూ. 12 లక్షలకు దక్కించుకుంది. అలాగే, టీజీ 09జీ0001 నెంబర్‌ను ఎన్స్‌పైరా మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ​5,66,111 రూపాయలకు సొంతం చేసుకుంది. 

ఇక, టీజీ09జీ0009 నెంబర్‌ను శ్రీనివాసా కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ రూ.5,25,000 లకు దక్కించుకుంది. టీజీ 09జీ0006  నెంబర్‌ను సాయి సిల్క్స్‌ కళామందిర్‌ లిమిటెడ్‌  3,92,000 రూపాయలకు సొంతం చేసుకుంది.  టీజీ 09జీ0005 నెంబర్‌ను నవలికా చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ. 2,01,100 దక్కించుకుంది. టీజీ 09జీ0019 నెంబర్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌1,60,019 రూపాయలకు పొందింది. టీజీ 09జీ0007 నెంబర్​ను గౌరీశంకర్​ లచ్చిరెడ్డి  రూ.1,16,000కు సొంతం చేసుకున్నారు.