లక్నో మ్యాచ్‌లో ఘోరం.. చీర్‌లీడర్లపై ప్రేక్షకుల అసభ్య ప్రవర్తన.. రంగంలోకి దిగిన పోలీసులు

లక్నో మ్యాచ్‌లో ఘోరం.. చీర్‌లీడర్లపై ప్రేక్షకుల అసభ్య ప్రవర్తన.. రంగంలోకి దిగిన పోలీసులు

Cheerleaders: లక్నోలోని ఏకానా క్రికెట్ స్టేడియం వేదికగా శనివారం (2026, మే23న) పంజాబ్ కింగ్స్ (PBKS) వర్సెస్ లక్నో సూపర్ జాయింట్స్ (LSG) మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఒక చేదు సంఘటన వెలుగు చూసింది. ప్లేఆఫ్స్ రేసులో నిలవడానికి పంజాబ్‌కు ఇది జీవన్మరణ సమస్య కావడంతో స్టేడియంలో వాతావరణం ఎంతో ఆవేశపూరితంగా కొనసాగింది. కానీ, మ్యాచ్ జరుగుతున్న సమయంలో కొందరు ప్రేక్షకులు మైదానంలో ఉన్న చీర్‌లీడర్ల (Cheerleaders)తో ప్రవర్తించిన తీరు అత్యంత అసభ్యంగా మారింది. 
  
స్టేడియంలో గొడవ: 
మ్యాచ్ ఉత్కంఠగా కొనసాగుతున్న వేళ, కొందరు ప్రేక్షకులు హద్దులు దాటి చీర్‌లీడర్లను వేధించడానికి, వారి పట్ల అనుచితంగా ప్రవర్తించడానికి ప్రయత్నించారు. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. పరిస్థితి చేయి దాటకముందే అక్కడే ఉన్న పోలీసులు వెంటనే స్పందించి గొడవకు కారణమైన వారితో మాట్లాడారు. స్టేడియంలో శాంతిభద్రతలను పునరుద్ధరించారు. ఒక క్రేజీ క్రికెట్ మ్యాచ్‌లో ఇలాంటి ఘటన జరగడంపై క్రీడాభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

►ALSO READ | ఆర్సీబీ చేతిలో మ్యాచ్ ఓడిన చెన్నై.. కోపంతో టీవీ పగలగొట్టిన ధోని?.. హర్భజన్ హాట్ కామెంట్స్!

సెంచరీతో పంజాబ్‌ను గెలిపించిన శ్రేయస్: 
మరోవైపు మ్యాచ్ విషయానికొస్తే.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కేవలం 51 బంతుల్లోనే 101 పరుగులతో అజేయమైన ఇన్నింగ్స్ ఆడి పంజాబ్‌కు 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందించాడు. ఐపీఎల్‌లో శ్రేయస్‌కు ఇది తొలి సెంచరీ కావడం విశేషం.. ఈ గెలుపుతో పంజాబ్ కింగ్స్ వరుసగా ఆరు మ్యాచ్‌ల ఓటములకు బ్రేక్ వేసింది.